Posts

Showing posts from June, 2022

ఇదో కొత్తరకం జాబ్ అద్దెకు బాయ్ ఫ్రెండ్ …అబ్బాయిలకు .. job

Image
  ప్రస్తుతం డేటింగ్ యాఫ్ ల కాలం నడుస్తుంది, టిండర్, ట్రులీ మడ్లీ లాంటి ఆప్ లో పేర్లు మీరు వినే ఉంటారు, ఇది కూడా ఒక విధంగా డేటింగ్ యాప్ లాంటిదే, దీని పేరు రేంటే బాయ్ ఫ్రెండ్, కాకపోతే ఇందులో బాయ్ ఫ్రెండ్స్ ని అద్దెకు కొనుక్కోవచ్చు,కౌశల్ ప్రకాష్ యాప్ సృష్టికర్త, ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా దీనిని రూపొందించారు, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి బాయ్ఫ్రెండ్ కావాలో కూడా ఎంచుకోవచ్చు, సెలబ్రిటీ బాయ్ ఫ్రెండ్ మోడల్ బాయ్ ఫ్రెండ్ నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఇలా రకాలు ఉంటాయి. వాటిలో మీరు ఎవరినైనా ఎంచుకోవచ్చు, సెలబ్రిటీ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకి 3000, మోడల్ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకు 2000, నార్మల్ పీపుల్ అయితే గంటకు 500, చెల్లించాల్సి ఉంటుంది. కేవలం పది పదిహేను నిమిషాల సమయం చాలు అంటే 500 చేయవచ్చు, వాళ్లతో ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కేవలం ఇది అమ్మాయిలకు మాత్రమే బెనిఫిట్ అనుకుంటే పొరపాటే, దీనినే అబ్బాయిలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు, అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ గా వెళ్లడానికి ఆసక్తి గా ఉన్నవారు కూడా ఈ యాప్ నిర్వాహకులను సంప్రదించవచ్చు. దీనిని ఒక ఉద్యోగంలా పాటించే వారి సంఖ్య ...

భర్తతో సహా ఇంట్లో అందరికీ మత్తు మందు పెట్టి.. పక్కింటి కుర్రాడితో పారిపోయిన యువతి!

Image
ఆ ఇంట్లో నుంచి రోజూ ఉదయాన్నే బయటకు వచ్చి జనాలతో మాట్లాడే 75 సంవత్సరాల వృద్ధురాలు బయటకు రాలేదు. ఆమె ముగ్గురు బిడ్డల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఏమైందా? అని ఇంట్లోకి వెళ్లిన ఇరుగుపొరుగు వారికి ఆ తల్లితోపాటు ముగ్గురు కొడుకులూ స్పృహలేని స్థితిలో కనిపించారు. అది చూసి షాకైన వాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని జునేద్‌పూర్ గ్రామంలో జరిగింది. ఆ కుటుంబ సభ్యులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షల్లో ఆ నలుగురు కుటుంబ సభ్యుల రక్తంలో మత్తుమందు దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్‌కు గురయ్యారు. పోలీసులు విచారణ కోసం వారిని ప్రశ్నించగా.. వృద్ధురాలి పెద్ద కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగిందని.. ఇప్పుడా కొత్త కోడలు కనబడడం లేదని తేలింది. కోడలు అంతకుముందు రోజు వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులంతా తిన్నారు. అంతే ఆ తర్వాత ఏమైందో తెలియదని చెప్పారు.  పోలీసులు ఆరా తీయగా.. సదరు ఇల్లాలు చేసిన దారుణం బయటపడింది. కుటుంబంలో అందరికీ మత్తుమంది పెట్టిన ఆమె.. పక్కింట్లో ఉండే ప్రియుడితో కలిసి పరారైంది. కొంతకాలంగా వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్...